తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 8 గంటల్లో సర్వదర్శనం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం నాటికి స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా నేరుగా క్యూలైన్లలోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.
ఇక నిన్న (ఆదివారం) ఒక్కరోజే 81,516 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 25,547 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ. 3.81 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ ప్రకటించింది.