BREAKING
శలాకకు ఉషశ్రీ శతజయంతి పురస్కారం శతజయంతి లోగో ఆవిష్కరణ సభలో రమణాచారి ప్రకటన మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొలగాని రాము.. నేడు ప్రమాణ స్వీకారం తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి నెల దర్శన టికెట్ల విడుదల! తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 8 గంటల్లో సర్వదర్శనం 'ఎల్లమ్మ'లో దేవిశ్రీ నటన చూసి షాక్ అవుతారు: వేణు 'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్రపై శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు జై శంభవేశ్వరా..కథ 'కిరికిరి' సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన దిల్ రాజు గతంలో ఎంపీటీసీగా గెలుపు.. ఇప్పుడు సర్పంచ్ బరిలో మారుతి రెడ్డి! శర్వానంద్ 'భోగి' ట్రైలర్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్ బంగారం, వెండి ధరలు డౌన్.. సోమవారం తులం ఎంతంటే? ఇఫీ 2026లో 'రామాయణ' ప్రదర్శన.. దేశానికి గౌరవం: నితీష్ తివారీ 'డేంజర్ బాయ్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్.. నవంబర్ 27న రిలీజ్ 'వృషకర్మ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 25న గ్రాండ్ ఈవెంట్ 15 దేశాల్లో రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా 'బాల 369': విజయ్ కుమార్ కలివరపు

మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొలగాని రాము.. నేడు ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొలగాని రాము.. నేడు ప్రమాణ స్వీకారం

మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొలగాని రాము.. నేడు ప్రమాణ స్వీకారం

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణం లోని  5వ వార్డు కౌన్సిలర్ కొలగాని రాము  మున్సిపల్ వైస్ చైర్మన్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను  ఆశీస్సులు, మార్గదర్శకత్వంలో కొలగాని రాము ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇప్పటికే రెండోసారి 5వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజల మన్ననలు పొందిన కొలగాని రాము, తాజాగా వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనుండటంతో ఆయన అనుచరులు, జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

వార్డు స్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తూ వచ్చిన ఆయనకు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా అవకాశం లభించడం పట్టణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బాధ్యతలతో పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో తనవంతు పాత్ర పోషించేందుకు ఆయనకు మరింత అవకాశం లభించనుంది.

కొలగాని రాము వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనుండటంతో జగ్గయ్యపేట పట్టణంలో జనసేన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

 

 

 

 

 

 

 

రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా