కోట్ల కుటుంబాన్ని కలిసిన ఎమ్మిగనూరు టీడీపీ నేతలు
*ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి,*
నేడు డోన్ మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మకు ఎమ్మిగనూరు టిడిపి నాయకులు ఘనంగా సన్మానించి హర్థిక శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మిగనూరు టీడీపీ నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్నలతో పాటు మంత్రాలయం టీడీపీ నాయకులు కౌతాళం సంజీవరెడ్డి వున్నారు. అనంతరం డోన్ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో ఆమె మరింత ప్రజాసేవ చేయాలని *ఆకాంక్షించారు.
A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా*