BREAKING
కేంద్ర నిధులకు బిఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం. ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం! తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు..

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్.

Select Suryaa Now
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్.

**కళ్యాణదుర్గం:** కళ్యాణదుర్గం మున్సిపాలిటీ నూతన వైస్ చైర్మన్‌గా వెంకట కార్తిక్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించిన అనంతరం ఆయన వైస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా, ఎక్స్‌ఆఫీషియో సభ్యుడిగా పాల్గొన్నారు. ఆర్డీఓ జి. వసంత బాబు నూతన చైర్మన్ బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, వైస్ చైర్మన్ వెంకట కార్తిక్‌తో పాటు కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వెంకట కార్తిక్ వైస్ చైర్మన్‌గా తన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నూతన వైస్ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని సూచించారు. వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకట కార్తిక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రతి వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, మున్సిపాలిటీ అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసుకుంటానని వెల్లడించారు. నూతన బాధ్యతలు చేపట్టిన వెంకట కార్తిక్‌కు పలువురు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.