BREAKING
నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు.. వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు స్నేహ గ్రూపులో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. రూ. 5 కోట్ల నగదు స్వాధీనం ఇండియా సినీ హబ్‌తో షూటింగ్ అనుమతులు సులభతరం ఇఫ్ఫీలో బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రౌండ్‌టేబుల్ ఐఐటీ మద్రాస్‌లో స్లీప్ స్టడీ ఫెసిలిటీ, ఆటిజం ల్యాబ్ ప్రారంభం మద్దులపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సహా లార్జ్-క్యాప్ ఐటీ షేర్లపై నిర్మల్ బంగ్ బేరిష్: ఏఆర్ రెహమాన్, భరత్ బాలా మరోసారి కలిసి పనిచేసిన వేళ పిడుగురాళ్ల శాఖకు మూడు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి పురస్కారాలు

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు..

Select Suryaa Now
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు..

*ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి* . సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు తీసుకొన్నాం అని ఎక్కడైనా అల్లరి ముఖలు అరాచక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మిగనూరు రూరల్ ఎస్సై కే శ్రీనివాసులు, ట్రాఫిక్ ఎస్ఐ ఆనందులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సోమవారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో వారు పర్యటించి అనుమానం వున్న వ్యక్తుల ఇళ్లను సోదా చేశారు. సమస్యాత్మక గ్రామమైన తిమ్మాపురంలో పోలీసులు సోమవారం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.  ఎస్ఐ కె. శ్రీనివాసులు, ట్రాఫిక్ ఎస్ఐ జి. ఆనంద్ ఆధ్వర్యంలో 25 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా అనుమానితులు, రౌడీషీటర్లు, వివాదాస్పద వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, పత్రాలు పరిశీలించిన అనంతరం యజమానులకు అప్పగించారు.ఎన్నికల్లో అల్లర్లు, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, సీఐ ఎస్. చిరంజీవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*