మద్దులపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
సూర్య పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న అరెల్లి బాబు అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు మద్దులపల్లి గ్రామ పంచాయతీ తరఫున ఈరోజు రూ.10,000/- ఆర్థిక సహాయం చేశారు.ఈ ఆర్థిక సహాయాన్ని సోమవారం గ్రామ సర్పంచ్ వెల్మ బలరామ్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు .ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెంటల తిరుపతి, వార్డు సభ్యులు జలజ–తిరుపతి, పంచాయతీ కార్యదర్శి నదీమ్ హుస్సేన్, మాజీ ఎంపీటీసీ చంద్రకల - సంజీవ్, అరెల్లి అంజయ్య, మ్యాక మహేష్, తదితరులు పాల్గొన్నారు.