BREAKING
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేరుపై మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్: బహుళ వృద్ధి కారకాలతో లాభాల బాట పట్టనుందన్న బ్రోకరేజ్ దిగ్గజం! సినిమా నేర్పవచ్చా లేక స్వయంగా ఆవిష్కరించుకోవాలా.. ఇఫ్ఫీలో బ్రిక్స్ చిత్రోత్సవానికి శ్రీకారం చుట్టిన రామాయణ తల్లి కన్నీటికి కరిగిన ఖాకీ.. గంటల్లోనే బాలిక ఆచూకీ గుర్తింపు విజయోత్సవ ర్యాలీ... స్వయంభు శ్రీ నాగ గణపతి స్వామి ఆలయంలో మూడు రోజుల సప్తాహ కార్యక్రమం.ప్రారంభం కొత్త పాలకవర్గానికి సవాళ్ల స్వాగతం 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 25,900 పైన నిఫ్టీ 50.. ఫోకస్‌లో టాటా స్టీల్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ఓపెన్ ఏఐపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ దావా ఇండోనేషియా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం ఇండోనేషియా స్టాక్ మార్కెట్ హోదాపై కీలక మలుపు ఆస్ట్రేలియా సంగీత దిగ్గజం మోలీ మెల్‌డ్రమ్ కన్నుమూత ఎనిమిది మంది మృతి, ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటన అయోధ్య - జనక్‌పూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ ప్రారంభం కోట్ల కుటుంబాన్ని కలిసిన ఎమ్మిగనూరు టీడీపీ నేతలు

తల్లి కన్నీటికి కరిగిన ఖాకీ.. గంటల్లోనే బాలిక ఆచూకీ గుర్తింపు

Select Suryaa Now
తల్లి కన్నీటికి కరిగిన ఖాకీ.. గంటల్లోనే బాలిక ఆచూకీ గుర్తింపు

 

సీపీ శంకబ్రత బాగ్చి తక్షణ స్పందనతో

 సురక్షితంగా ఇంటికి చేరిన చిన్నారి

గాజువాక, మేజర్ న్యూస్ : ఆపదలో ఉన్నామని ఒక్క ఫోన్ చేస్తే చాలు.. పోలీసు యంత్రాంగం అండగా నిలుస్తుందనే భరోసాను విశాఖ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) శంకబ్రత బాగ్చి మరోసారి నిజం చేశారు. కనిపించకుండా పోయిన తమ 12 ఏళ్ల కుమార్తె కోసం ఓ తల్లి కన్నీటిపర్యంతమవుతూ చేసిన ఫోన్‌కు తక్షణమే స్పందించిన ఆయన, రాత్రికి రాత్రే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి కొన్ని గంటల్లోనే బాలిక ఆచూకీని గుర్తించేలా చర్యలు తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని చినగంట్యాడలో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు 12 ఏళ్ల బాలికలను పరీక్షల సమయంలో ఒకరినొకరు చూసుకుంటున్నారనే కారణంతో ఉపాధ్యాయులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ ఇద్దరు విద్యార్థినులు ఇంటికి వెళ్లాక తల్లిదండ్రుల ఫోన్ల ద్వారా మాట్లాడుకొని ఇళ్ల నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం (21వ తేదీ) రాత్రి అగనంపూడికి చెందిన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి గాజువాక చేరుకోగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను గమనించిన ఓ ట్యాక్సీ డ్రైవర్ వివరాలు ఆరా తీసి తల్లిదండ్రులకు అప్పగించారు. 

అయితే, నాతయ్యపాలెంకు చెందిన మరో బాలిక ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె తల్లి నేరుగా సీపీ శంకబ్రత బాగ్చికి ఫోన్ చేసి తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు. తల్లి కన్నీటి విజ్ఞప్తికి మానవీయ కోణంలో స్పందించిన సీపీ, బాలికను సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యతను గాజువాక పోలీసులకు అప్పగించారు. ఆయన ఆదేశాల మేరకు సీఐ వాసు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సైలు రమణ, జగదీష్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రంతా విస్తృతంగా గాలించడంతో పాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, శనివారం (22వ తేదీ) ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ములగాడ ప్రాంతంలో బాలికను గుర్తించి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. సత్వరమే స్పందించి తమ బిడ్డను కాపాడిన సీపీ బాగ్చికి, గాజువాక పోలీసులకు బాలిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టర్ : పీ.కోటిరెడ్డి, గాజువాక ఇంచార్జ్, విశాఖపట్నం