BREAKING
గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, శుభాకాంక్షలు భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ మాదక ద్రవ్యాల పరిశీలన తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి డిసెంబర్ 27 న కరీంనగర్ లో జరిగే ఉప సర్పంచ్,వార్డు సభ్యుల బహిరంగ సభ ను జయప్రదం చేయండి..ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఎంపీడీవో పనితీరుతో ఇబ్బందుల్లో ఉద్యోగులు కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగరాజు దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రత్యేక పూజలు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు. నూతన ఎస్సై స్వరూప రాజ్ కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ బంధనకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

కేంద్ర నిధులకు బీఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్

Select Suryaa Now
కేంద్ర నిధులకు బీఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్

 వరంగల్ సిటీ, మేజర్ న్యూస్, వరంగల్ నగర అభివృద్ధిపై నిన్న జరిగిన బీఆర్ఎస్ సభలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అందించిన నిధులు, పథకాలను తామే ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన సాగిందని మండిపడ్డారు. నిన్నటి సభలో కేటీఆర్ తెరపై చూపించిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగాయని ఆయన  పేర్కొన్నారు. వరంగల్ నగర సుందరీకరణలో భాగంగా నిర్మించిన భద్రకాళి బండ్, ఆధునిక వైకుంఠ ధామాలు, సైకిల్ ట్రాక్, రీజనల్ లైబ్రరీ ఆధునీకరణ, మరియు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం అప్‌గ్రేడేషన్ పనులన్నీ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్, అమృత్, హృదయ్ పథకాల కింద ఇచ్చిన వందల కోట్ల రూపాయల నిధులతోనే పూర్తయ్యాయని తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు మంజూరు చేస్తే, వాటికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుందని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించి, కమీషన్ల కక్కుర్తితో వరంగల్ అభివృద్ధిని అటకెక్కించిందే తప్ప సొంతంగా చేసింది ఏమీ లేదని గంట రవికుమార్ విమర్శించారు. మరోవైపు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కూడా వరంగల్ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే నాణేనికి రెండు వైపులా అని అన్నారు. వరంగల్ నగర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నది కేవలం భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మాత్రమేనని గంట రవికుమార్ స్పష్టం చేశారు. అబద్ధపు ప్రచారాలతో ఓరుగల్లు ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్‌ను ఆయన హెచ్చరించారు.

రిపోర్టర్; సంతోష్ కె, వరంగల్ సిటీ, వరంగల్ జిల్లా