BREAKING
మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం మార్కాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుల సంఘాలు బలపడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: బీఆర్ఎస్ నేత పీజీఆర్ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన మార్కాపురం జిల్లా నూతన జిల్లా పరిషత్ చైర్మన్ కందుల రామిరెడ్డి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. హౌస్ అరెస్ట్ వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య ఆశీస్సులతో ఆరంభం.. కోడిగేనహళ్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డి నామినేషన్! మాగుంట శ్రీనివాసులురెడ్డిని కలిసిన 28వ డివిజన్ నూతన కార్పొరేటర్ సోలేటి అల్లూరయ్య 40,43వ వార్డులలో కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారం రాయదుర్గం పసుపు మయం ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన చైర్మన్ హనుమంతు!! కేంద్ర నిధులకు బీఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ కేంద్ర నిధులకు బిఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్.

కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. హౌస్ అరెస్ట్

Select Suryaa Now
కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. హౌస్ అరెస్ట్

సూర్య కరీంనగర్: సెవెన్ హిల్స్ వద్ద సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ పర్యటన నేపథ్యంలో నిరసనకు సిద్ధమైన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ముకరంపురంలోని ఆయన కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హల్ద్వానీలో పర్యటించిన ప్రాంతాన్ని శుద్ధి చేసి అంటరానితనాన్ని ప్రోత్సహించిన ఘటనపై కరీంనగర్‌కు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను ప్రశ్నిస్తామని తెలిపారు. ఈ అంశంపై మాట్లాడేందుకు సిద్ధమైతే బీజేపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎస్సీ సెల్, మైనారిటీ సెల్ జిల్లా, నగర అధ్యక్షులు, నాయకులను పోలీసులపై ఒత్తిడి తెచ్చి అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్‌పై ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా పేర్కొనడం ఏమిటని, ఓటు హక్కుపై ప్రశ్నించిన వారంతా దేశద్రోహులా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వైఖరిని నరేందర్ రెడ్డి తప్పుబట్టారు. అరెస్టు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.