BREAKING
శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో కార్తీక పౌర్ణమి యజ్ఞం అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు కరీంనగర్ మేయర్‌కు ఆహ్వానం 3వ వరల్డ్ మేయర్స్ ఫోరం 2026లో పాల్గొననున్న గుంటూరు మేయర్, కమిషనర్ కార్తీక పౌర్ణమి వేడుకలతో గోదావరి తీరంలో ఆధ్యాత్మిక శోభ 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ అప్‌డేట్.. తనపై తానే సెటైర్ వేసుకున్న నాని కార్తీక పౌర్ణమి వేడుకల్లో సామూహిక వ్రతాలు సెమీస్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఎ! త్రివిక్రమ్ సినిమాలో ఇలాంటి పాట ఏంటి? యూట్యూబ్‌లో మళ్ళీ ట్రోల్ అవుతున్న వెంకటేష్ సాంగ్ పుల్లూరు బండపై భక్తుల కోలాహలం మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా! ఫహద్ ఫాజిల్ 'అసరీరి' రిలీజ్ డేట్ ఫిక్స్.. న్యూ ఇయర్ కానుకగా థియేటర్లలోకి గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!! జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి.. కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ

రాయదుర్గం పసుపు మయం ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన చైర్మన్ హనుమంతు!!

Select Suryaa Now
రాయదుర్గం పసుపు మయం ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన చైర్మన్ హనుమంతు!!

రాయదుర్గం టౌన్ మేజర్ న్యూస్: 
రాయదుర్గం పట్టణం పూర్తిగా పసుపుమయంగా మారింది. మున్సిపల్ చైర్మన్ టంకశాల హనుమంతు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు,పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణమండపం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. పసుపు కండువాలు వేసుకుని, టీడీపీ జెండాలు చేతబట్టి, డప్పు వాయిద్యాలు, బాణాసంచా మోతల మధ్య వేలాది మంది కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు,ర్యాలీ వెళ్తున్న దారి పొడవునా ప్రజలు, అభిమానులు ఇరువైపులా నిలబడి చైర్మన్ హనుమంతుకు, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలు చోట్ల మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. యువకులు బైకులపై ర్యాలీలో పాల్గొని సందడి చేస్తున్నారు, దీంతో పట్టణ ప్రధాన రహదారి అంతా జనంతో కిక్కిరిసిపోయింది,ఈ సందర్భంగా చైర్మన్ టంకశాల హనుమంతుకు, నూతన కౌన్సిలర్లకు పార్టీ నాయకులు పూలమాలలతో ఘన సత్కారం చేస్తున్నారు. అభిమానులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు,ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్న చైర్మన్ హనుమంతు, వైస్ చైర్మన్  , వార్డు కౌన్సిలర్లకు కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.