BREAKING
మంత్రి శ్రీధర్ బాబు మొండి వైఖరి వీడాలి – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పై కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి! సురభి వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ సామాజిక పరివర్తన విద్యార్థులతోనే సాధ్యం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ బీసీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాగిలి సత్యం స్ప్రింగ్ ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలి... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ 20 26 కు ఎంపిక. లబ్ధిదారురాలికి ఇందిరమ్మ బీమా అందజేత మురహరి ప్రేమలత నరసయ్యని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమంతునిపాడు మండల తెలుగుదేశంపార్టీ నాయకులు మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం మార్కాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ శ్రీ సత్యసాయి బాబా వారి 101వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుల సంఘాలు బలపడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: బీఆర్ఎస్ నేత పీజీఆర్ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన మార్కాపురం జిల్లా నూతన జిల్లా పరిషత్ చైర్మన్ కందుల రామిరెడ్డి

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: బీఆర్ఎస్ నేత పీజీఆర్

Select Suryaa Now
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: బీఆర్ఎస్ నేత పీజీఆర్

 

...​కరువు పరిస్థితులు, సాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాలని డిమాండ్

...​ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టీకరణ

గుర్రంపోడ్ మేజర్ న్యూస్ :

గుర్రంపోడ్ మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులు, నాగార్జునసాగర్ నీటి సమస్య, కొత్త పెన్షన్ల మంజూరు తదితర ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పీజీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీయడంతోనే నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తదితర నాయకులు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని పీజీఆర్ విమర్శించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, వృద్ధుల పెన్షన్లను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచుతామని, వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ అందిస్తామని, ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రైతులకు రైతు భరోసా, రైతు బీమా అమలు చేస్తామని, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఆ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.అదేవిధంగా చదువుకునే మహిళలకు స్కూటర్లు అందిస్తామని, ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాలను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారని, కానీ నేటికీ ఆ హామీల అమలుపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థినులు, మహిళలు, ఆటో డ్రైవర్లు నిరాశకు గురవుతున్నారని అన్నారు. కొత్తగా పెళ్లైన మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ కూడా అమలుకు నోచుకోలేదని విమర్శించారు.రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర, కొనుగోలు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్రంపోడు మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులు, సాగునీటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని పీజీఆర్ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని, వికలాంగులకు రూ.6,000 పెన్షన్, రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్కూటర్లు, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అన్ని హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.