కుల సంఘాలు బలపడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి
సూర్య- బిక్కనూరు : కుల సంఘాలు బలపడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చెప్పారు. సోమవారం మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలో తన స్వంత 20 లక్షల నిధులతో నిర్మించబోతున్న ముదిరాజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు ఆయన వివరించారు. గ్రామాలలో కుల సభ్యులు ఐక్యమత్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగయ్యగారి నర్సింలు, ఉప సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు