మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి
విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్ : విజయవాడ నగర మేయర్‌గా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలని తూర్పు కాపు సామాజిక వర్గ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం సీతన్నపేట గేట్ వద్ద నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. గత ఐదేళ్లుగా బొండా సిద్ధార్థ పార్టీ కార్యక్రమాలతో పాటు పేదలకు సహాయం, యువత, విద్యార్థులతో సమావేశాలు, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. యువతకు పాలనలో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆయనకు మేయర్ పదవి ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఇప్పిలి రామ్మోహన్, కర్ణం వెంకటరమణ, పిన్నింటి శ్రీను, ఇప్పిలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.