BREAKING
మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్: ధనుష్, మమ్ముట్టి ఓఎం బాక్సాఫీస్ జోరు! 16 వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా.. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన నాగభూషణమ్మ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: నేపాల్‌పై పాకిస్థాన్ ఏ ఘనవిజయం.. సెమీస్‌లోకి దూకుడు! అంతరంగ పరివర్తనకు దేవతా యోగ 41వ డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేయడమే లక్ష్యం... కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ నసీమున్నిషా భోగి అన్నాచెల్లెళ్ల భావోద్వేగ కథ.. రక్తపాతం తప్పనిసరి: సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు! పైల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అపోలో హాస్పిటల్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026: భారత్‌కు నిరాశ.. వీర్ దాస్, రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు దక్కని పురస్కారాలు! మాక్స్ మొరాండోతో వివాహ వేడుక: తండ్రితో డ్యాన్స్ చేసిన మైలీ సైరస్ భావోద్వేగ ఫోటోలు! గోల్డెన్ హార్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కార్తీక్ విజయ్ చరిత్ర! బోటుతో సహా ఏడుగురు గల్లంతు దివ్యాంగుల సాధికారత కు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి స్వర్ణ దేవాలయంలో వందలాది రోటీలు చేశాను: గుర్‌పురబ్ వేళ నటి మోనా సింగ్ జ్ఞాపకాలు మల్లంగుంట సర్పంచ్ గా పార్లపల్లి ముని కృష్ణారెడ్డి ఏకగ్రీవం క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి

మల్లంగుంట సర్పంచ్ గా పార్లపల్లి ముని కృష్ణారెడ్డి ఏకగ్రీవం

Select Suryaa Now
మల్లంగుంట సర్పంచ్ గా పార్లపల్లి ముని కృష్ణారెడ్డి ఏకగ్రీవం

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్:
తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట  గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్లపల్లి మునికృష్ణారెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందారు. ఈ మేరకు మంగళవారం రాత్రి గ్రామపంచాయతీ కార్యాలయంలో మునికృష్ణారెడ్డికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డిక్లరేషన్ ఫారాన్ని అందజేశారు. అనంతరం వార్డు సభ్యులందరి ఆమోదముతో ఉప సర్పంచ్ గా ఒకటవ వార్డు మెంబర్ మస్తాన్ సాహెబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సర్పంచ్ పార్లపల్లి మునికృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ  తన విజయానికి సహకరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని, నియోజకవర్గ టిడిపి నేతలు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని కాలనీలలో సిమెంటు రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపడతాను. అలాగే ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి వారందరికీ మొదటి ఆరు నెలల లోపు ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో  ఇంటి స్థలాలు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని కాలనీలలో, గ్రామంలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకువస్తానని, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ ఐదేళ్లపాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామని చెప్పారు. సర్పంచ్ గా ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని, పంచాయతీ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని సర్పంచ్ మునికృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ముని కృష్ణారెడ్డి అనుచరులు, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.

H. Dwaraka, staff reporter 

9705347341