BREAKING
అంతరంగ పరివర్తనకు దేవతా యోగ 41వ డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేయడమే లక్ష్యం... కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ నసీమున్నిషా భోగి అన్నాచెల్లెళ్ల భావోద్వేగ కథ.. రక్తపాతం తప్పనిసరి: సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు! పైల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అపోలో హాస్పిటల్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026: భారత్‌కు నిరాశ.. వీర్ దాస్, రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు దక్కని పురస్కారాలు! మాక్స్ మొరాండోతో వివాహ వేడుక: తండ్రితో డ్యాన్స్ చేసిన మైలీ సైరస్ భావోద్వేగ ఫోటోలు! గోల్డెన్ హార్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కార్తీక్ విజయ్ చరిత్ర! బోటుతో సహా ఏడుగురు గల్లంతు దివ్యాంగుల సాధికారత కు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి స్వర్ణ దేవాలయంలో వందలాది రోటీలు చేశాను: గుర్‌పురబ్ వేళ నటి మోనా సింగ్ జ్ఞాపకాలు మల్లంగుంట సర్పంచ్ గా పార్లపల్లి ముని కృష్ణారెడ్డి ఏకగ్రీవం క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి 45 మిలియన్ డాలర్ల నుంచి 70.4 మిలియన్ డాలర్లకు: మాలిబు ఎస్టేట్ విలువలో భారీ పెరుగుదల! బైక్ అదుపుతప్పి ముగ్గురికి గాయాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి

కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి

Select Suryaa Now
 కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి

- కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఆర్ఎంసీలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

కాకినాడ, మేజర్ న్యూస్ : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ బాక్సుల భద్రత,ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ)లో ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్,కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కళాశాలలోని ఎగ్జామినేషన్ హాల్, ఆడిటోరియం,డైనింగ్ హాల్, మీడియా పాయింట్ తదితర ప్రాంతాలను పరిశీలించి,అక్కడ చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన మౌలిక సదుపాయాలు,భోజన ఏర్పాట్లు,వాహనాల పార్కింగ్,బ్యాలెట్ బాక్సుల భద్రత, కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు తదితర అంశాలను సమీక్షించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి జాప్యం, ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ, కాకినాడ ఆర్డీవో ఎస్. మల్లిబాబులకు కలెక్టర్ సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ..కాకినాడ నగరపాలక సంస్థకు ఈ నెల 26వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు,ఈ నెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులను భద్ర పరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర నిఘా ఉండేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని,కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన లకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకం గా, ప్రశాంత వాతావరణంలో,నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, తమకు కేటాయించిన బాధ్యతలనుసమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.

ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, సూపరింటెండెంట్‌ ఇంజనీర్ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ డి. పృథ్వి చరణ్, పోలీసు అధికారులు, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.