BREAKING
మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్: ధనుష్, మమ్ముట్టి ఓఎం బాక్సాఫీస్ జోరు! 16 వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా.. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన నాగభూషణమ్మ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: నేపాల్‌పై పాకిస్థాన్ ఏ ఘనవిజయం.. సెమీస్‌లోకి దూకుడు! అంతరంగ పరివర్తనకు దేవతా యోగ 41వ డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేయడమే లక్ష్యం... కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ నసీమున్నిషా భోగి అన్నాచెల్లెళ్ల భావోద్వేగ కథ.. రక్తపాతం తప్పనిసరి: సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు! పైల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అపోలో హాస్పిటల్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026: భారత్‌కు నిరాశ.. వీర్ దాస్, రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు దక్కని పురస్కారాలు! మాక్స్ మొరాండోతో వివాహ వేడుక: తండ్రితో డ్యాన్స్ చేసిన మైలీ సైరస్ భావోద్వేగ ఫోటోలు! గోల్డెన్ హార్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కార్తీక్ విజయ్ చరిత్ర! బోటుతో సహా ఏడుగురు గల్లంతు దివ్యాంగుల సాధికారత కు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి స్వర్ణ దేవాలయంలో వందలాది రోటీలు చేశాను: గుర్‌పురబ్ వేళ నటి మోనా సింగ్ జ్ఞాపకాలు మల్లంగుంట సర్పంచ్ గా పార్లపల్లి ముని కృష్ణారెడ్డి ఏకగ్రీవం క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి

క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి

Select Suryaa Now
క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి

- టీబీ బాధితులకు సకాలంలో గుర్తింపు, మెరుగైన వైద్యం, పోషకా హారం అందించాలి.

- 2030 నాటికి క్షయ మహమ్మారిని అంతం చేయడమే లక్ష్యం.

- జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

కాకినాడ, మేజర్ న్యూస్ : జిల్లాలో క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వ యంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి టీబీ ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో టీబీ నియంత్రణకు చేపడుతున్న చర్యలు, వ్యాధిగ్రస్తుల గుర్తింపు, నిర్ధారణ పరీక్షలు, చికిత్స, నిక్షయ్ పోషణ్ యోజన అమలు,మందుల సరఫరా, వైద్య సిబ్బంది, మౌలిక సదు పాయాల కల్పన తదితర అంశాలపైవైద్యాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. టీబీ వ్యాధిగ్రస్తులను ముందస్తుగా గుర్తించడం, సకాలంలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, పూర్తిస్థాయి వైద్యం అందించడం, పోషకాహార సహాయం కల్పించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని సూచిం చారు. క్షయ రహిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా 2030 నాటికి క్షయ మహమ్మారిని పూర్తిస్థాయిలో అంతం చేయడానికి అధికారులు సమష్టిగా కృషి చేయా లని తెలిపారు. సున్నా మరణాలు, సున్నా కొత్త వ్యాధి కేసులు,సున్నా ఆర్థిక భారం అనే లక్ష్యాల దిశగా పనిచేయాలన్నారు ...జిల్లాలో ప్రస్తుతం క్షయ మరణాల రేటు సుమారు 2.3 శాతంగా ఉందని, వ్యాధి వ్యాప్తి (ఇన్సిడెన్స్) రేటును మరింత తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సూచించారు.

నిక్షయ్ పోషణ్ యోజన, మందుల సరఫరాపై ప్రత్యేక దృష్టి

టీబీ బాధితులకు టీవీ ముక్తాభారత్ అభియాన్ మరియు నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా అందిస్తున్న పోషకాహార సహాయం, మందుల సరఫరా బాస్కెట్ల పంపిణీపై కలెక్టర్ సమీ క్షించారు. కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, తదితర ప్రాంతాల్లో పోషకాహార బాస్కెట్ల పంపిణీలో వెనుకబాటు ఉన్నట్లు గుర్తించి, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి ఇండెంట్ పెండింగ్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో సరఫరాలో జాప్యం జరిగినట్లు అధికారులు వివరించగా, ఈ వారంలో సరఫరా అందే అవకాశం ఉందని తెలిపారు. నిర్ణీత సమయంలో సరఫరా అందకపోతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచిం చారు.

పరీక్షలు, వ్యాధి నిర్ధారణలో లక్ష్యాలు సాధించాలి

జిల్లా కు నిర్దేశించిన  టీబీ పరీక్షల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా తుని, జగ్గంపేట ప్రాంతాల్లో పరీక్షల ప్రక్రియను మ రింత వేగవంతం చేయాలన్నారు. అలాగే టీబీ కేసుల నోటిఫికేషన్ లక్ష్యాన్ని సాధించేలా పెద్దపూడి, పిఠాపురం, తాళ్లరేవు ప్రాంతా ల్లో ప్రగతిని మెరుగుపరచాలని సూచించారు.

టీబీ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డిఫ రెన్షియల్ టీబీ కేర్ కింద హిమోగ్లోబిన్ (Hb), రాండమ్ బ్లడ్ షుగర్ (RBS), బ్లడ్ యూరియా, సీరమ్ క్రియా టినిన్, లివర్ ఫంక్షన్ టెస్టులు  వంటి అవ సరమైన పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స సమయంలో నిరంతరం పర్యవేక్షించాలని తెలి పారు. ప్రస్తుతం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల  స్థాయిలో సుమారు 75 శాతం మేర ఈ పరీక్షలు జరుగుతున్నాయని, మిగిలిన లక్ష్యాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేయా లని ఆదేశించారు.

టీబీ యూనిట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

తుని, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం టీబీ యూనిట్లలో ప్రత్యేక కార్యాలయ గదులు, అవసరమైన వర్క్‌స్పేస్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ మేల్ వార్డులను అవసరాలకు అనుగు ణంగా విభజించి వినియోగించుకునే అవకా శాలను పరిశీలించాలని తెలిపారు. ఔషధాల వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న బాధితులు, ఎక్స్‌టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్  మల్టీ డ్రగ్ రెసిస్టెంట్  టీబీ కేసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జీజీ హెచ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు కేటాయించాలని ఆదేశిం చారు. జీజీహెచ్‌లోని టీబీ, ఛాతీ వ్యాధుల విభాగంలో ఎండీఆర్ టీబీ బాధితుల కోసం ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలకు కలిపి నాలుగు పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని సూచిం చారు.

ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి

టీబీ నియంత్రణ కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు అవసరమైన మానవ వనరు లను అందుబాటులో ఉంచాలని  ఆదేశించారు.ఖాళీగా ఉన్న అకౌంటెంట్,టీబీ హెల్త్ విజిటర్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జగ్గంపేటలో ఎస్‌టీఎస్ విధులకు గైర్హాజరవుతున్న అంశంపై సంబంధిత ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీబీ నియంత్రణ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు, స్వయం సహాయక సంఘాలు  గ్రామ సంస్థలు  కీలక భాగస్వాములుగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. గ్రామ సభలు, స్వయం సహా యక సంఘాల సమావేశాల్లో టీబీ నియంత్రణ అంశాన్ని అజెండాగా చేర్చి వ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్స, పోషకాహార సహా యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డిజిటల్ సేవలు, అవగాహనకార్యక్రమాలను ,నిక్షయ్ యాప్,  వినియోగం పై ఆశా కార్యకర్తలు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు  ఏఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. టీబీ నియం త్రణకు సంబం ధించిన సమాచార, విద్య, కమ్యూ నికేషన్ (కార్యక్రమాల కోసం కేటాయించిన బడ్జెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..

టీబీ బాధితులు వైద్య చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా నిరంతరంపర్యవేక్షించాలని, నిర్ణీత కాలవ్యవధి వరకు మందులు క్రమం తప్పకుండా వినియో గించేలా వైద్య సిబ్బంది బాధితులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టీబీ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నివారణ చర్యలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. టీబీ బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార సహాయం, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇతర సంబంధిత శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో టీబీ నియం త్రణ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిక అనిత టీవీ ఎయిడ్స్ లెప్రసి నియంత్రణ అధికారి ఎస్ చలమయ్య,వైద్యాధికారులు,జిల్లా టీబీ నియంత్రణ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.