BREAKING
అదానీ పోర్ట్స్ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 'బై' రేటింగ్: కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం...! రోజూ ఉదయం ఎండలో నిలబడితే ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు! దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు.. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్: ధనుష్, మమ్ముట్టి ఓఎం బాక్సాఫీస్ జోరు! 16 వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా.. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన నాగభూషణమ్మ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: నేపాల్‌పై పాకిస్థాన్ ఏ ఘనవిజయం.. సెమీస్‌లోకి దూకుడు! అంతరంగ పరివర్తనకు దేవతా యోగ 41వ డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేయడమే లక్ష్యం... కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ నసీమున్నిషా భోగి అన్నాచెల్లెళ్ల భావోద్వేగ కథ.. రక్తపాతం తప్పనిసరి: సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు! పైల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అపోలో హాస్పిటల్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026: భారత్‌కు నిరాశ.. వీర్ దాస్, రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు దక్కని పురస్కారాలు! మాక్స్ మొరాండోతో వివాహ వేడుక: తండ్రితో డ్యాన్స్ చేసిన మైలీ సైరస్ భావోద్వేగ ఫోటోలు! గోల్డెన్ హార్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కార్తీక్ విజయ్ చరిత్ర! బోటుతో సహా ఏడుగురు గల్లంతు

41వ డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేయడమే లక్ష్యం... కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ నసీమున్నిషా

Select Suryaa Now
41వ డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేయడమే లక్ష్యం...  కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ నసీమున్నిషా

తిరుపతి, మేజర్ న్యూస్:
తనను ఆదరించి గెలిపించిన 41 వ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి సమస్యల రహిత డివిజన్ గా చేయడమే తన లక్ష్యమని కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం చేసిన షేక్. నసిమున్నిసా తెలిపారు. ఎస్వీ యూ ఆడిటోరియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో 41 డివిజన్ కార్పొరేటర్ గా షేక్ నసిమున్నిసా ప్రమాణం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని వీధులలో తాగునీటి  సమస్య లేకుండా చేయడంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రతిరోజు డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో తన భర్త టిడిపి రాష్ట్ర మైనారిటీ సంఘం కార్య నిర్వాహక కార్యదర్శి  షేక్ మహబూబ్ బాషా తో కలసి పర్యటించి ప్రజా సమస్యలను గుర్తించి అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించే దిశగా చొరవ చూపుతామన్నారు. తనపై విశ్వాసంతో కార్పొరేటర్ గా గెలిపించిన ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం కల్పించారన్నారు. ప్రజలు తనకు కల్పించిన అవకాశాన్ని పదవిగా కాకుండా గొప్ప బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నారు. మాటలు కాదు.. పనితీరే సమాధానం అనే సంకల్పంతో డివిజన్ ప్రజలందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని షేక్ నసిమున్నిసా చెప్పారు. అనంతరం పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ సంఘం ప్రతినిధులు ఆమెను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

H. Dwaraka, staff reporter 

9705347341