BREAKING
భారత్‌లో కేవలం 3% సహజ వాయువు మాత్రమే ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్... చలికాలంలో బద్దకాన్ని తరిమికొట్టండి: ఇంట్లోనే చేసే ఐదు సులభమైన వ్యాయామాలు! ప్రజల తీర్పు స్పష్టం..కూటమిదే గెలుపు -వైసీపీకి ఓటుతోనే బుద్ధి చెప్పిన ప్రజానీకం -పులివెందుల నుంచి పంచాయతీ దాకా.. జెండా ఎగరేది కూటమిదే -మీడియా సమావేశంలో మేయర్ జేబీ శ్రీనివాస్ సంగనపల్లి పంచాయతీలో టీడీపీలోకి వైసీపీ కార్యకర్త చలికాలంలో గోరువెచ్చని నిమ్మరసం తాగితే శరీరానికి ఊహించని లాభాలు! ఎన్విడియా సీఈవోగా జెన్సెన్ హువాంగ్ రీ-ఎంట్రీపై ఉదయ్ కోటక్ కీలక వ్యాఖ్యలు: తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తోందా? ఈ తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావొచ్చు! అదానీ పోర్ట్స్ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 'బై' రేటింగ్: కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం...! రోజూ ఉదయం ఎండలో నిలబడితే ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు! దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు.. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్: ధనుష్, మమ్ముట్టి ఓఎం బాక్సాఫీస్ జోరు! 16 వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా.. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన నాగభూషణమ్మ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: నేపాల్‌పై పాకిస్థాన్ ఏ ఘనవిజయం.. సెమీస్‌లోకి దూకుడు! అంతరంగ పరివర్తనకు దేవతా యోగ

దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..

Select Suryaa Now
దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..

భోగాపురం రోడ్డు ప్రమాదంతో పీఎం పాలెంలో విషాద ఛాయలు....

మృతులలో పీఎం పాలెంకి చెందిన దంపతులు....

దైవదర్శన యాత్రలో విషాదంతో అనాథలైన చిన్నారులు.....

పీఎం పాలెం, మేజర్ న్యూస్:  శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం ఆలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పి.ఎం.పాలెం హెచ్‌పీసీఎల్ లేఅవుట్‌లోని జాస్మిన్ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో పదేళ్లుగా నివసిస్తున్న వాకలపూడి శ్రీనివాస్, కుసుమ రజని దంపతులు దుర్మరణం చెందారు. ఆర్కే బీచ్ ఊటగడ్డకు చెందిన శ్రీనివాస్ సీతంపేట బీవీకే కళాశాల ఎదురుగా ఉన్న రిలయన్స్ దుకాణంలో నిర్వాహకుడిగా (మేనేజర్) పనిచేస్తుండగా, మద్దిలపాలెం రేసపువానిపాలెం ప్రాంతానికి చెందిన రజని గృహిణి. 2015లో వివాహమైన ఈ దంపతులకు పదేళ్ల కుమారుడు జియాన్స్, ఎనిమిదేళ్ల కుమార్తె గ్రీష్మ ఉన్నారు. కాకినాడలో కుమార్తె వద్ద ఉండే శ్రీనివాస్ తల్లి లక్ష్మి ఇటీవల కుమారుడి ఇంటికి రాగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం వేకువజామున ఒంటి గంటకు చిన్నారులను నాయనమ్మ వద్ద వదిలి దంపతులు సొంత కారులో బయలుదేరారు. మార్గమధ్యలో తగరపువలస వద్ద మరో ముగ్గురిని ఎక్కించుకుని శ్రీకూర్మం చేరుకుని, దర్శనానంతరం ఆనంద క్షణాలను సామాజిక మాధ్యమాల్లో స్టేటస్‌లుగా ఉంచి తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కారు నడుపుతున్న శ్రీనివాస్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పి ఎడమవైపు నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో నమోదైంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. శవపరీక్ష అనంతరం మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు మృతదేహాలను అంబులెన్స్‌లో పి.ఎం.పాలెంలోని నివాసానికి తీసుకొచ్చారు. అప్పటివరకు తమతో నవ్వుతూ గడిపిన తల్లిదండ్రులు విగతజీవులుగా మారడంతో దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్న ఆ ఇద్దరు చిన్నారులు, వృద్ధురాలైన తల్లిని చూసి స్థానికుల హృదయాలు ద్రవించాయి.