ప్రజల తీర్పు స్పష్టం..కూటమిదే గెలుపు -వైసీపీకి ఓటుతోనే బుద్ధి చెప్పిన ప్రజానీకం -పులివెందుల నుంచి పంచాయతీ దాకా.. జెండా ఎగరేది కూటమిదే -మీడియా సమావేశంలో మేయర్ జేబీ శ్రీనివాస్
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా..తీర్పు ఒక్కటే! ప్రజలు కూటమి ప్రభుత్వం వైపే నిలబడ్డారు. రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కూటమికి తిరుగులేని విజయాలను తెచ్చిపెడుతోందని తిరుపతి మేయర్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన జేబి శ్రీనివాస్ మొదటిసారి తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మేయర్ జేబి శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచిందన్నారు. అందుకే కార్పొరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ప్రతి ఎన్నికలోనూ ప్రజలు కూటమినే ప్రజలు ఆశీర్వదించారని తెలియజేశారు.
బీసీలకు కూటమే అండ..వైసీపీయే ద్రోహం
వైసీపీ హయాంలో బీసీ రిజర్వేషన్ కుదించి 16,800 మంది రాజకీయ ప్రాతినిధ్యాన్ని చంపేశారని జేబీ మండిపడ్డారు. 34 శాతం ఇవ్వాలని కూటమి ప్రయత్నిస్తే కేసులు వేసి అడ్డుకున్నది వైసీపీయేనని, అయినా వెనక్కి తగ్గకుండా పార్టీ పరంగా 40 శాతం రిజర్వేషన్ ఇచ్చి సామాజిక న్యాయానికి కూటమి నిలబడిందని స్పష్టం చేశారు.
పులివెందులలో 40 ఏళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం
వైసీపీ హయాంలో రిగ్గింగులు, దాడులు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, 40 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుతంగా ఓటు వేశారంటే అదే నిజమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని జేబీ అన్నారు. మేయర్లు, చైర్‌పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నిక తీసుకొచ్చిన విజనరీ లీడర్ చంద్రబాబు అని, పి4 ద్వారా ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు.పంచాయతీల్లోనూ అఖండ మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించి గ్రామగ్రామాన కూటమి జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్