ఆదర్శ నగరంగా తిరుపతి -ఆధ్యాత్మిక నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -ప్రజా సమస్యలకు తొలి ప్రాధాన్యత -వంద రోజుల ప్రణాళికతో నగర రూపు రేఖలను మారుస్తాం -నగరపాలక సంస్థ మేయర్ జెబి శ్రీనివాస్ -నేడు మేయర్ గా బాధ్యతల స్వీకరణ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : యావత్ దేశం తిరుపతి నగరం వైపు చూసేలా అభివృద్ధి చేసి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతానని నగరపాలక సంస్థ నూతన మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన జెబి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుపతి నగరపాలక సంస్థ రెండవ సాధారణ ఎన్నికలలో రికార్డ్ స్థాయిలో భారీ మెజార్టీ సాధించి మేయర్ గా ఎన్నికై ప్రజల మన్నలను పొందిన జేబీ శ్రీనివాస్ సోమవారం ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన బుధవారం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయములో మేయర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగొందుతున్న తిరుపతి నగరాన్ని 100 రోజుల ప్రణాళికతో మరింత అభివృద్ధి పదములో నడిపిస్తానన్నారు. స్థానిక ప్రజలు భారీ మెజారిటీతో మేయర్ గా గెలిపించడం మరింత బాధ్యతను పెంచిందని వారి ఆకాంక్షల మేరకు అధికారుల సహకారంతో నిత్యం శ్రమిస్తానని చెప్పారు. నగరాభివృద్ధిలో టీటీడీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానని భక్తుల మనోభావాలకు అనుగుణంగా వారికి నడుచుకుంటానని పేర్కొన్నారు.
-ప్రజా సమస్యలకు తొలి ప్రాధాన్యత
తిరుపతి నగర ప్రజల సమస్యలకు తొలి ప్రాధాన్యతనిస్తూ ప్రతి సమస్యను పరిష్కరించి అండగా ఉంటానని తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లతో కలిసిమెలిసి నగరాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నగరంలో ప్రధాన సమస్యలైన యు డి ఎస్ తాగునీటి సమస్య సిసి రోడ్లు నిర్మాణం పారిశుద్ధ్య నిర్వహణ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పారించనున్నట్టు తెలియజేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తిరునగరిని రోల్ మోడల్ గా నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
-నేడు అట్టహాసంగా బాధ్యతలు స్వీకరణ
ఎస్వీ యూనివర్సిటీ లో సోమవారం అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేసిన నగరపాలక సంస్థ మేయర్ జేబీ శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థలో అట్టహాసంగా ఆయన తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించి అధికారులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు మేయర్ ఛాంబర్ తో పాటు బాధ్యతల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్