BREAKING
నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత సుసరాం సర్పంచ్ ను అభినందించిన కృష్ణ చైతన్య... ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదు సైకిల్ గుర్తుకి ఓటు వేయండి శ్రీకాకుళం స్వర్ణయుగానికి నాంది పలికిన రెండున్నరేళ్ల కూటమి పాలన

ఎన్నికలకు 48 గంటల ముందుగానే ర్యాలీలు, ప్రచారాలు ముగింపు

Select Suryaa Now
ఎన్నికలకు 48 గంటల ముందుగానే ర్యాలీలు, ప్రచారాలు ముగింపు

 

-- మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారంపై నిషేధం.
-- పోలీసు యాక్ట్ 30, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం ఆంక్షల అమలు.
-- సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాల మోహరింపు.
-- ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

-- ఎన్నికలపై ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు

-- జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం-మేజర్ న్యూస్ ప్రతినిధి:

జిల్లాలోని శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస పురపాలక ఎన్నికలు తోపాటు కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో  నవంబర్ 26న జరగనున్న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం ముగియనుందని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు.48 గంటల ముందు నుంచే ఎన్నికల ప్రచారంపై నిషేధం అమల్లోకి వస్తుందని, ఈ సమయంలో ఎలాంటి ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదని తెలిపారు.మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ఎన్నికల ఎట్టి ప్రచారం నిర్వహించరాదని, ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలకు అనుమతి లేదన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండరాదని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

పోలింగ్ రోజు పటిష్ట భద్రత,ఆంక్షలు:

పోలీసు యాక్ట్ 30, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. అనుమతి లేని సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదు. అనవసరంగా ప్రజలు గుంపులుగా గుమిగూడవద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనల ప్రకారం 100/200 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమలు చేస్తారు. ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు.అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్టీ బృందాలు, రిజర్వ్ పార్టీలు, ఫ్లయింగ్ స్క్వాడ్లను అందుబాటులో ఉంచారు. జిల్లా సరిహద్దులు, ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అక్రమ నగదు, మద్యం, ఇతర ప్రలోభాల వస్తువుల రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

పోలింగ్ అనంతరం కూడా పటిష్ట భద్రత:

పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే సమయంలో ప్రత్యేక భద్రత, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తారు. పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బృందాలతో నిరంతర పర్యవేక్షణ, మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు గస్తీ చేపడతారు. గత ఎన్నికల్లో నేరచరిత్ర కలిగి, ప్రస్తుత ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై ఇప్పటికే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఎవరైనా ఓటర్లను బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు:

ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సమస్యలు, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు గుర్తించినట్లయితే కింది నంబర్లకు సమాచారం అందించాలి.

- జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్: 6309990933
- ఎలక్షన్ సెల్ కంట్రోల్ రూమ్: 6309990923
- శ్రీకాకుళం డీఎస్పీ: 6309990804
- కాశీబుగ్గ డీఎస్పీ: 6309990805

ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.