సుసరాం సర్పంచ్ ను అభినందించిన కృష్ణ చైతన్య...
నరసన్నపేట నవంబర్ 24 మేజర్ న్యూస్: నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన తొలి సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోలాకి మండలం సుసరాం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ప్రముఖ న్యాయవాది దుంపల జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య దుంపల జ్యోతిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఆమెకు పార్టీ కండువా కప్పి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ విభాగం అధ్యక్షుడు ఆరంగి మురళీధర్, మాజీ ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, మండల అధ్యక్షుడు కణితి కృష్ణారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ దుంపల భాస్కరరావు, ధర్మాన లక్ష్మణదాస్, రాష్ట్ర కార్యదర్శి చింతు రాఘవరావు, జిల్లా యువజన కార్యదర్శి కణితి సత్తిబాబు, మండల యువజన అధ్యక్షుడు రెంటికోట త్రినాథరావు, కోట త్యాగరాజు, గొల్లంగి అసిరితాత, కోటిపల్లి శ్రీనివాస్, పెరుమాళ్ల తావిటి నాయుడు, బాన్న శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.