BREAKING
రేపు త్యాగరాజ మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

Select Suryaa Now
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

 

పరవాడ, నవంబర్ 24, మేజర్ న్యూస్: 
మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం , వెన్నెలపాలెం గ్రామాల్లో గురువారం పోలింగ్ జరుగుతున్న చోట్ల శాంతి భద్రతల ఏర్పాటల్లో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా, పోలింగ్ రోజున ఓటర్లు పాటించాల్సిన నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మైక్ ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఇప్పటికే ఆయా గ్రామాల్లో సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి బైండోవర్ చర్యలు చేపట్టినట్లు, రౌడీషీటర్లు, తగాదాలకు పాల్పడే వ్యక్తులు మరియు పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.