BREAKING
రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం పల్లె పల్లెకు మెపా మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత. సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..!

శ్రీకాకుళం స్వర్ణయుగానికి నాంది పలికిన రెండున్నరేళ్ల కూటమి పాలన

Select Suryaa Now
శ్రీకాకుళం స్వర్ణయుగానికి నాంది పలికిన రెండున్నరేళ్ల కూటమి పాలన


-గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి.. రానున్న రోజుల్లో రెట్టింపు వేగంతో ప్రగతి
-60 వార్డుల్లో కూటమి జెండా ఎగరడమే లక్ష్యం.. -మేయర్ అభ్యర్థి రాధారాణితో పాటు కూటమి అభ్యర్థులను గెలిపించండి
– కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, నవంబర్ 24, మేజర్ న్యూస్ :

శ్రీకాకుళం నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా రెండున్నరేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరానికి ఇది స్వర్ణయుగమని, రానున్న రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి వార్డుకు చేరుస్తామని స్పష్టం చేశారు.
మంగళవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థి రాధారాణి ను అత్యధిక మెజారిటీ తో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉదయం  43వ వార్డు విశాఖ బి కాలనీలో అంబటి అమ్మాజమ్మ తరఫున ప్రచారం ప్రారంభించారు. అనంతరం 58వ వార్డు ఏఎస్ఎన్ కాలనీలో గురుగుబెల్లి వెంకట కృష్ణరాజు, 42వ వార్డు గొంటి వీధిలో రమణ మాదిగ, 45వ వార్డు కత్తెర వీధిలో ఇప్పిలి భారతి, 40వ వార్డు బాకర్‌సాహెబ్‌పేటలో మీగడ సంత వినయ్ భూషణరావు, 41వ వార్డు ఇప్పిలి వీధిలో బసవ రాజేష్ రెడ్డి, 37వ వార్డు పెద్దరెల్లి వీధిలో పొట్నూరు చంద్రవతికి మద్దతుగా ప్రచారం నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం నగరానికి రైల్వే జోన్ సాధించడంతో పాటు, శ్రీకాకుళం నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేయించామని తెలిపారు. నగరంలో గత పదహారేళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని, ఈ పరిస్థితిని మార్చి నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు చొరవ చూపిందని చెప్పారు. ఎన్నికల నిర్వహణతోనే సగం విజయం సాధించామని, ఇప్పుడు ప్రజల ఆశీస్సులతో మిగిలిన విజయాన్ని సాధించాల్సి ఉందన్నారు.ప్రజల్లోకి వెళ్తున్న ప్రతిచోటా అపూర్వమైన ఆదరణ, మద్దతు లభిస్తోందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని మొత్తం 60 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణితో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు అత్యధిక మెజారిటీతో విజయాన్ని అందించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల అభివృద్ధి విజన్ ప్రతి వార్డుకు చేరాలంటే ఈ ఎన్నికలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని, ప్రజలు ఇచ్చే తీర్పుతో రెట్టింపు వేగంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.శ్రీకాకుళం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలంటే కార్పొరేషన్‌లో కూటమి విజయం అవసరమని మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.