BREAKING
రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం పల్లె పల్లెకు మెపా మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత. సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..!

మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదు

Select Suryaa Now
మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదు


-కుటుంబ కష్టాలను రాజకీయాలకు ముడిపెడతారా?
-తమ్మినేని సీతారాంపై ప్రచార కథనాలను ఖండించిన చిరంజీవి నాగ్
ఆమదాలవలస, నవంబర్ 24, మేజర్ న్యూస్ 
ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికలు జరుపుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఎన్నికల ప్రచారానికి సహకరించడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో, ఓ స్థానిక దినపత్రికలో ప్రచురితమైన కథనాలపై వైసీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ స్పందించారు. ఈ కథనాలను ఆయన ఖండిస్తూ వీడియో సందేశం ద్వారా వాస్తవ పరిస్థితులను మంగళవారం వెల్లడించారు. సీనియర్ నాయకులు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జి తమ్మినేని సీతారాం ఎన్నికల సమయంలో పార్టీకి సహకరించడం లేదంటూ వచ్చిన ప్రచారంపై చిరంజీవి నాగ్ వివరణ ఇచ్చారు. తనకు స్వల్ప అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, శస్త్రచికిత్స కూడా జరిగిందని తెలిపారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బాధ్యతగల తండ్రిగా తమ్మినేని సీతారాం తన వద్దే ఉండి వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఇదే సమయంలో తన బావ హనుమంతు రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణంలో ఉండగా కారు ప్రమాదానికి గురయ్యారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో తన సోదరితో పాటు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారని, వారిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వారిని పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు తన తల్లిదండ్రులిద్దరూ ప్రస్తుతం నెల్లూరులో ఉన్నారని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో వాస్తవాలను తెలుసుకోకుండా బాధించే విధంగా వార్తలు ప్రచురించడం బాధాకరమని చిరంజీవి నాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా వార్తను ప్రచురించే ముందు సంబంధిత వ్యక్తులను సంప్రదించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించుకోవడం మీడియా బాధ్యత అని పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో తన తండ్రి తమ్మినేని సీతారాంపై, తమ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచురిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యక్తిగత, కుటుంబ పరిస్థితులను వక్రీకరించడం సరికాదని తన వీడియో సందేశం ద్వారా పేర్కొన్నారు.