ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం
- జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక సమీక్ష
పోలాకి నవంబర్ 24 మేజర్ న్యూస్ : జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం మంగళవారం డోలలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించింది. జిల్లా ప్రోగ్రాం మేనేజింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర, జిల్లా గణాంక అధికారి శ్రీరామ నాగేశ్వరరావు, డీపీఓ మురళి తదితరులతో కూడిన బృందం ఆరోగ్య కేంద్రంలోని వైద్య సేవలను పరిశీలించింది.
ఈ సందర్భంగా వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, గర్భిణుల ఆరోగ్య పరీక్షలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధుల్లో నిర్వహిస్తున్న పనుల పురోగతిపై ఆరోగ్య విస్తరణ అధికారి డాక్టర్ నల్లి రవికుమార్‌తో సమీక్షించారు. కార్యక్రమాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, సేవల నిర్వహణ తీరుపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మోహిని, శేఖర్‌బాబు, లక్ష్మి, రమాదేవి, దమయంతి, ఝాన్సీ, విజయ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.