BREAKING
నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత సుసరాం సర్పంచ్ ను అభినందించిన కృష్ణ చైతన్య... ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదు సైకిల్ గుర్తుకి ఓటు వేయండి శ్రీకాకుళం స్వర్ణయుగానికి నాంది పలికిన రెండున్నరేళ్ల కూటమి పాలన

చలో ఢిల్లీని జయప్రదం చేయండి - పలాసలో సీఐటీయూ పోస్టర్ ఆవిష్కరణ.

Select Suryaa Now
చలో ఢిల్లీని జయప్రదం చేయండి - పలాసలో సీఐటీయూ పోస్టర్ ఆవిష్కరణ.

 

డిసెంబర్ 1,2,3 తేదీల్లో ఢిల్లీలో ఆక్యూపే ఢిల్లీ - కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు.

పలాస, నవంబర్ 24, మేజర్ న్యూస్.

డిసెంబర్ 1, 2, 3 తేదీలలో నిర్వహించనున్న చలో ఢిల్లీ (ఆక్యూపే ఢిల్లీ) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కాశీబుగ్గ పాత బస్టాండ్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్. గణపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.కనీస వేతనాలు అమలు చేయాలి,కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి,కాంట్రాక్టు విధానం రద్దు చేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి,ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు జి. కృష్ణవేణి,మున్సిపల్ యూనియన్ నాయకులు కె. వెంకట్, సి.హెచ్. మురగన్, దివాకర్, ప్రకాష్, రాజేష్, గీత నాయక్, శకుంతల, శివ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.