సురక్షిత బాల్యం - బాలల రక్షణ ఉద్యమం.
కాశీబుగ్గ ఎస్.ఎఫ్.ఎస్. హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు - పోక్సో, బాల్యవివాహ, మత్తు పదార్థాలపై చైతన్యం.
పలాస,నవంబర్ 24,మేజర్ న్యూస్.
బాలల రక్షణ,వారి హక్కులపై మండల న్యాయ సేవా సంఘం, పలాస ఆధ్వర్యంలో మంగళవారం కాశీబుగ్గలోని ఎస్.ఎఫ్.ఎస్. హైస్కూల్ లో "సురక్షిత బాల్యం - బాలల రక్షణ ఉద్యమం"అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు కె. దేవరాజు, జి.ఎం.ఎస్. అనిల్ రాజు, కె. లోకేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.పోక్సో చట్టం - బాలలపై అత్యాచార నిరోధక చట్టం, బాల్యవివాహ నిరోధక చట్టం,మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నివారణ,గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ గురించి వివరించారు.బాలలు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చెప్పాలని, మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించాలని న్యాయవాదులు సూచించారు.
ఉచిత న్యాయ సేవలకు 15100.
ఉచిత న్యాయ సేవల కొరకు 15100 టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఎవరికైనా న్యాయ సహాయం అవసరమైనప్పుడు ఈ నంబర్‌కు కాల్ చేసి ఉచిత సేవలు పొందవచ్చని వివరించారు.కార్యక్రమంలో ఫాదర్ మరియు ప్రిన్సిపాల్ రాజకుమార్,పద్మజ,అరుణ, మురళి,తదితర ఉపాధ్యాయ సిబ్బంది,అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.బాలల రక్షణపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో ధైర్యాన్ని, చైతన్యాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.