ఎన్నికలవేళ నిబంధనలు తప్పనిసరి
-జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ
శ్రీకాకుళం, నవంబర్ 24, మేజర్ న్యూస్
శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్, ఆమదాలవలస మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిబ్బందికి ఎన్నికల సమయంలో ఎక్సైజ్ నేరాలపై నిరంతరం నిఘా ఉంచి, అక్రమ మద్యం రవాణా, విక్రయాలు మరియు నాటుసారా తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలని
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి తిరుపతి నాయుడు ఆదేశాలు జారీ చేయడమైనది.ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా జిల్లాలోకి రాకుండా చెక్‌పోస్టులను పటిష్ఠం చేయడంతో పాటు, టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా ప్రధాన రహదారులు మరియు ఇతర మార్గాల్లో నిరంతరం నిఘా ఏర్పాటు చేయడమైనది. ఎక్సైజ్ సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు, దాడులు నిర్వహిస్తూ అక్రమ మద్యం కార్యకలాపాలపై చర్యలు తీసుకుంటున్నారు.ఎన్నికల నేపథ్యంలో ఈరోజు అనగా తేదీ 24.11.2026 సాయంత్రం 05.00 గంటల నుంచి తేదీ 26.11.2026 సాయంత్రం 05.00 గంటల వరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్, ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు మరియు కల్లు దుకాణాలతో పాటు ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో మరియు ఆయా ప్రాంతాల పరిధిలోని 5 కిలోమీటర్ల మేర ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయడం జరిగింది.
తేదీ 14.10.2026 నుంచి ఇప్పటివరకు జిల్లాలో నిర్వహించిన దాడులు, తనిఖీలలో నమోదైన కేసులు, అరెస్టులు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
నాటుసారా కేసులు: 12 కేసులు నమోదు చేసి, 17 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగింది. 510 లీటర్ల నాటుసారాతో పాటు 7 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఇతర రాష్ట్రాల మద్యం 6 కేసులు నమోదు చేసి, 6 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగింది. 2.53 లీటర్ల మద్యం, 16.45 లీటర్ల బీరును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
అక్రమ మద్యం 132 కేసులు నమోదు చేసి, 132 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగింది. 156.39 లీటర్ల మద్యం, 31.85 లీటర్ల బీరును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
మొత్తంగా ఇప్పటివరకు 151 కేసులు నమోదు చేసి, 155 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగింది.
అంతేకాకుండా, వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వ్యక్తులను సంబంధిత మండల మేజిస్ట్రేట్ల ఎదుట హాజరుపరిచి, మొత్తం 1,162 మందిపై బైండ్ఓవర్ చర్యలు తీసుకోవడం జరిగింది.ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అక్రమ మద్యం తయారీ, నిల్వ, రవాణా మరియు విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.