BREAKING
మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

నిర్ణీత సమయానికే కౌంటింగ్ పూర్తి చేయాలి

Select Suryaa Now
నిర్ణీత సమయానికే కౌంటింగ్ పూర్తి చేయాలి

 

-- రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా

శ్రీకాకుళం-మేజర్ న్యూస్ ప్రతినిధి:
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే రోజు పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనున్నందున నిర్ణీత సమయానికే కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీలు), గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, జడ్పీ సీఈఓ వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి స్వరూప రాణి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రవణ్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.