BREAKING
నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత సుసరాం సర్పంచ్ ను అభినందించిన కృష్ణ చైతన్య... ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదు సైకిల్ గుర్తుకి ఓటు వేయండి శ్రీకాకుళం స్వర్ణయుగానికి నాంది పలికిన రెండున్నరేళ్ల కూటమి పాలన

అవినీతి, అక్రమాలకు చరమగీతం పాడాలంటే వైఎస్సార్‌సీపీని గెలిపించాలి..

Select Suryaa Now
అవినీతి, అక్రమాలకు చరమగీతం పాడాలంటే వైఎస్సార్‌సీపీని గెలిపించాలి..

 

- మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవితో పాటు 60 మంది అభ్యర్థులను గెలిపించండి.

- మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం, నవంబర్ 24 మేజర్ న్యూస్: శ్రీకాకుళం నగరంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలకు పిలుపునిచ్చారు. మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవితో పాటు పార్టీ తరఫున పోటీ చేస్తున్న 60 మంది అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

శ్రీకాకుళం నగరంలోని చిన్నబజార్ రోడ్డులో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, రిజిస్ట్రేషన్ విలువలను పెంచి ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపిందని విమర్శించారు. మున్సిపల్ కార్యాలయంలో పనులు జరగాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల అనుమతుల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.