BREAKING
బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత సుసరాం సర్పంచ్ ను అభినందించిన కృష్ణ చైతన్య... ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదు సైకిల్ గుర్తుకి ఓటు వేయండి శ్రీకాకుళం స్వర్ణయుగానికి నాంది పలికిన రెండున్నరేళ్ల కూటమి పాలన రసమే సాహిత్యానికి ప్రాణం.. మహిళా వర్సిటీ తెలుగు సాహితీ సమితిలో ఆచార్య పి.హరనాథ్

సహజ ప్రసవాలపై అవగాహన

Select Suryaa Now
సహజ ప్రసవాలపై అవగాహన

విశాఖ ఎడ్యుకేషన్,  మేజర్ న్యూస్ : సహజ ప్రసవాలపై అవగాహన కోసం గీతం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 'వాక్ ఫర్ నేచురల్ బర్త్ జరిగింది. మంగళవారం  గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్, ఎన్ఎస్ఎస్  యూనిట్-19 సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా  సంయుక్త ఆధ్వర్యంలో  'వాక్ ఫర్ నేచురల్ బర్త్' (అవగాహన నడక) కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతం క్యాంపస్ నుండి రుషికొండ బీచ్ రోడ్ వరకు ఈ అవగాహన ర్యాలీ ఉత్సాహంగా సాగింది.
ఈ కార్యక్రమంలో నర్సింగ్  ఇతర విభాగాలకు చెందిన మొత్తం 260 మంది విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం చురుకుగా పాల్గొన్నారు. సహజ ప్రసవ విధానాలు, ప్రసవ సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన సరైన నిర్ణయాలు, గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణ (రెస్పెక్ట్‌ఫుల్ మెటర్నిటీ కేర్) మరియు ప్రసవ సమయంలో మహిళలకు అందించాల్సిన మానసిక, శారీరక మద్దతు యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలతో సహజ ప్రసవాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు.