16 వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా.. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన నాగభూషణమ్మ
తిరుపతి, మేజర్ న్యూస్ :
తనను ఆదరించి అక్కున చేర్చుకుని గెలిపించిన 16వ డివిజన్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, ఆ డివిజన్ అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని 16 వ డివిజన్ కార్పొరేటర్ ఆర్ నాగభూషణమ్మ చెప్పారు. ఆమె ఎస్ వి యు ఆడిటోరియంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్పొరేటర్ గా ప్రమాణం చేశారు. అంతకు మునుపు తన భర్త తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్, టిడిపి తిరుపతి పార్లమెంటు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ ముని రామయ్య తో కలిసి టౌన్ క్లబ్ సర్కిల్ లోని స్వర్గీయ నందమూరి రామారావు విగ్రహానికి గజపూల మాల వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 16వ డివిజన్లో అన్ని ప్రాంతాలలో పర్యటించి ఏ సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులను సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడతామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మొదట ప్రాధాన్యతగా తీసుకొని వాటిని పరిష్కరించేందుకు దృష్టి పెడతానని చెప్పారు. ఏడాదిలోపు డివిజన్లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించి సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్థానికంగా ఉన్న కూటమి నాయకులతో పాటు కార్యకర్తలు ప్రజలు అందరి సహకారంతో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ కాలువలను పునరుద్ధరించడం, తాగునీటి సమస్య లేకుండా చేయడం, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సన్నిహితులు ఆమెను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తన భర్త ముని రామయ్య ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలకు ఈరోజు ఒక ప్రత్యేక గుర్తింపు లభించిందని, గౌరవాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తున్నానని నాగభూషణమ్మ పేర్కొన్నారు.
H. Dwaraka, staff reporter
9705347341