BREAKING
అదానీ పోర్ట్స్ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 'బై' రేటింగ్: కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం...! రోజూ ఉదయం ఎండలో నిలబడితే ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు! దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు.. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్: ధనుష్, మమ్ముట్టి ఓఎం బాక్సాఫీస్ జోరు! 16 వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా.. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన నాగభూషణమ్మ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: నేపాల్‌పై పాకిస్థాన్ ఏ ఘనవిజయం.. సెమీస్‌లోకి దూకుడు! అంతరంగ పరివర్తనకు దేవతా యోగ 41వ డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేయడమే లక్ష్యం... కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ నసీమున్నిషా భోగి అన్నాచెల్లెళ్ల భావోద్వేగ కథ.. రక్తపాతం తప్పనిసరి: సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు! పైల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అపోలో హాస్పిటల్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026: భారత్‌కు నిరాశ.. వీర్ దాస్, రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు దక్కని పురస్కారాలు! మాక్స్ మొరాండోతో వివాహ వేడుక: తండ్రితో డ్యాన్స్ చేసిన మైలీ సైరస్ భావోద్వేగ ఫోటోలు! గోల్డెన్ హార్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కార్తీక్ విజయ్ చరిత్ర! బోటుతో సహా ఏడుగురు గల్లంతు

పైల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అపోలో హాస్పిటల్

Select Suryaa Now
  పైల్స్  పై అవగాహన కార్యక్రమాన్ని  నిర్వహించిన   అపోలో హాస్పిటల్

ఆరిలోవ, నవంబర్ 24, మేజర్ న్యూస్ : అపోలో హాస్పిటల్స్, విశాఖపట్నం, అసోసియేషన్ ఆఫ్ కోలన్ అండ్ రెక్టల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రపంచ హెమరాయిడ్స్ దినోత్సవాన్ని సందర్భంగా మంగళవారం విశాఖ వుడా చిల్డ్రన్స్ అరీనా లో పైల్స్ పై ప్రజా అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.    ఈ కార్యక్రమానికి సినియర్ సిటిజన్లు, ఉద్యోగులు, గృహిణులు, ప్రజలతో కలిపి 300 మందికి పైగా హాజరై మంచి స్పందన లభించింది. పైల్స్ కు గల కారణాలు, లక్షణాలు, ప్రమాద కారకాలు, నివారణ మరియు చికిత్సా విధానాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. పైల్స్ అనేది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే సాధారణ సమస్య అని సినియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. మురళీధర్ నంబాడ, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డా. జి. శాంతారావు, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. సతీష్ బాబు బొద్దేపల్లి, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. రవి చంద్రా రెడ్డి పేర్కొన్నారు. విశాఖ  అపోలో హాస్పిటల్స్,  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. కృష్ణ ప్రసాద్, మెడికల్ సూపరింటిండెంట్ డా. బాలకృష్ణ వెదుల్లా  కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల ప్రయోజనం కోసం ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు అపోలో హాస్పిటల్స్, హెల్త్ సిటీ, విశాఖపట్నం 0891-2867777 సంప్రదించవలెనని తెలిపారు.