BREAKING
మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్: ధనుష్, మమ్ముట్టి ఓఎం బాక్సాఫీస్ జోరు! 16 వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా.. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన నాగభూషణమ్మ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: నేపాల్‌పై పాకిస్థాన్ ఏ ఘనవిజయం.. సెమీస్‌లోకి దూకుడు! అంతరంగ పరివర్తనకు దేవతా యోగ 41వ డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేయడమే లక్ష్యం... కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ నసీమున్నిషా భోగి అన్నాచెల్లెళ్ల భావోద్వేగ కథ.. రక్తపాతం తప్పనిసరి: సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు! పైల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అపోలో హాస్పిటల్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026: భారత్‌కు నిరాశ.. వీర్ దాస్, రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు దక్కని పురస్కారాలు! మాక్స్ మొరాండోతో వివాహ వేడుక: తండ్రితో డ్యాన్స్ చేసిన మైలీ సైరస్ భావోద్వేగ ఫోటోలు! గోల్డెన్ హార్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కార్తీక్ విజయ్ చరిత్ర! బోటుతో సహా ఏడుగురు గల్లంతు దివ్యాంగుల సాధికారత కు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి స్వర్ణ దేవాలయంలో వందలాది రోటీలు చేశాను: గుర్‌పురబ్ వేళ నటి మోనా సింగ్ జ్ఞాపకాలు మల్లంగుంట సర్పంచ్ గా పార్లపల్లి ముని కృష్ణారెడ్డి ఏకగ్రీవం క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి

దివ్యాంగుల సాధికారత కు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి

Select Suryaa Now
దివ్యాంగుల సాధికారత కు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి

- సదరం ధృవపత్రాల మంజూరు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి..

- విభిన్న ప్రతిభావంతుల జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో డీఆర్వో డా.డి. తిప్పేనాయక్.

కాకినాడ, మేజర్ న్యూస్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ ఫలాలు అర్హులైన దివ్యాంగులకు నూరు శాతం అందేలా జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి డా.డి.తిప్పేనాయక్ స్పష్టం చేశారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లో డి ఆర్ ఓ అధ్యక్షతన జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దివ్యాంగుల సాధికారతకు చేపట్టవలసిన చర్యలు, సదరం ధృవపత్రాల మంజూరు, భవిత కేంద్రాలు మరియు దివ్యాంగుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, వారికి వివిధ అంశాలపై నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులు, దివ్యాంగుల సంఘ ప్రతినిధులతో డీఆర్వో విస్తృతంగా చర్చించారు. వివిధ విభిన్న ప్రతిభవంతుల సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను, సూచనలను ఈ సందర్భంగా కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా డీఆర్వో డా.డి. తిప్పేనాయక్ మాట్లాడుతూ.. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఎటువంటి అసౌకర్యాలు లేని జిల్లాగాతీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక క్రీడా పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని డీఆర్వో పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో బదిరి లకు అవసరమైన సౌకర్యాలు, అన్ని పాఠశాలలు, కళాశాలల్లో దివ్యాంగులకు అనుకూలంగా ర్యాంపులు నిర్మించాలని, దివ్యాంగుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. దివ్యాంగులకు స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించాలని సూచించారు.

  ఈ సమావేశంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి ఏ.వై. శ్రీనివాస్, డీఎంహెచ్ఓ డా.కె.అనిత, లీడ్ బ్యాంక్ మేనేజర్ హెచ్.ఎస్.వి. ప్రసాద్, వికాస పీడీ కె. లచ్చారావు,ఉమా మనోవికాస కేంద్రం ప్రతినిధి ఎస్పి రెడ్డి, రెడ్ క్రాస్ కార్యదర్శి, వీరితో పాటు విభిన్న ప్రతిభావంతుల సంఘ ప్రతినిధులు సి.హెచ్.సుబ్బారావు, జి. కొండలరావు, పి. సురేష్ కుమార్, కె. రమేష్, వై. కిషోర్, పి. శశి కుమార్, బాపిరెడ్డి, బి.వి.వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.