BREAKING
అదానీ పోర్ట్స్ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 'బై' రేటింగ్: కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం...! రోజూ ఉదయం ఎండలో నిలబడితే ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు! దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు.. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్: ధనుష్, మమ్ముట్టి ఓఎం బాక్సాఫీస్ జోరు! 16 వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా.. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన నాగభూషణమ్మ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: నేపాల్‌పై పాకిస్థాన్ ఏ ఘనవిజయం.. సెమీస్‌లోకి దూకుడు! అంతరంగ పరివర్తనకు దేవతా యోగ 41వ డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేయడమే లక్ష్యం... కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ నసీమున్నిషా భోగి అన్నాచెల్లెళ్ల భావోద్వేగ కథ.. రక్తపాతం తప్పనిసరి: సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు! పైల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అపోలో హాస్పిటల్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026: భారత్‌కు నిరాశ.. వీర్ దాస్, రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు దక్కని పురస్కారాలు! మాక్స్ మొరాండోతో వివాహ వేడుక: తండ్రితో డ్యాన్స్ చేసిన మైలీ సైరస్ భావోద్వేగ ఫోటోలు! గోల్డెన్ హార్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కార్తీక్ విజయ్ చరిత్ర! బోటుతో సహా ఏడుగురు గల్లంతు

భోగి అన్నాచెల్లెళ్ల భావోద్వేగ కథ.. రక్తపాతం తప్పనిసరి: సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు!

Select Suryaa Now
భోగి అన్నాచెల్లెళ్ల భావోద్వేగ కథ.. రక్తపాతం తప్పనిసరి: సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి చిత్రంపై దర్శకుడు సంపత్ నంది ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నవంబర్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో, తన బాల్య జ్ఞాపకాలు, కథా నేపథ్యం గురించి సంపత్ నంది వెల్లడించారు. ఇది కేవలం రొటీన్ రూరల్ యాక్షన్ కథ కాదని, అన్నాచెల్లెళ్ల అనుబంధం ప్రధానంగా సాగే భావోద్వేగ కథ అని ఆయన స్పష్టం చేశారు. కథా డిమాండ్ మేరకు కొన్ని సందర్భాల్లో రక్తపాతం కూడా అనివార్యమైందని, అయితే దాని వెనుక బలమైన కారణాలు, భావోద్వేగాలు ఉంటాయని పేర్కొన్నారు.  

ఇటీవల వస్తున్న పలు రూరల్ యాక్షన్ చిత్రాల తరహాలో ఇది కేవలం బానిసత్వ పోరాటం లేదా ఐడెంటిటీ చుట్టూ తిరిగే కథ కాదని సంపత్ నంది తేల్చిచెప్పారు. నమ్మకాలు, మూఢనమ్మకాలు, ప్రేమ, ప్రతీకారం అనే నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా భోగి కథను రూపొందించినట్లు వివరించారు. ఒక విషయాన్ని జనం బలంగా నమ్మితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, నమ్మకపోతే పరిణామాలు ఎలా ఉంటాయనే కోణాన్ని ఇందులో చూపించామన్నారు. 1960వ దశకం చివరిలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో శర్వానంద్ గంగ అనే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నారు.  

సినిమాలో శర్వానంద్ పాత్ర ప్రయాణం గురించి మాట్లాడుతూ, కథ ప్రారంభమైన మొదటి గంటన్నర పాటు హీరో ఎంతో సహనం, ఓపికతో కనిపిస్తాడని, తొంభై నిమిషాల తర్వాత అసలైన యాక్షన్ రూపంలో విజృంభిస్తాడని సంపత్ నంది తెలిపారు. ఈ చిత్రంలో శర్వానంద్ నటన అత్యద్భుతంగా ఉందని, ఆయనకు జాతీయ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, చంద్రబోస్ అన్ని పాటలు రాశారు.  

నిర్మాత కె.కె. రాధామోహన్‌కు ఆర్థిక భారం పడకుండా పక్కా ప్రణాళికతో చిత్రీకరణ పూర్తి చేసినట్లు సంపత్ నంది వెల్లడించారు. ఇరవై ఒక్క రోజుల పాటు షూటింగ్ చేసిన క్లైమాక్స్‌లో ఒక్క షాట్ కూడా వృథా కాకుండా జాగ్రత్త పడ్డామని, కథ వేగానికి అడ్డుపడుతుందనే భావనతో ఒక ప్రత్యేక పాటను షూట్ చేయకుండానే పక్కన పెట్టేశామని చెప్పారు. కొత్త దర్శకుడు చేసిన సినిమాగా భావించి భోగిని చూడాలని, నచ్చితే పది మందికి చెప్పాలని ప్రేక్షకులను, మీడియాను సంపత్ నంది కోరారు.