ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
కాకినాడ, మేజర్ న్యూస్ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)గోదామును కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి. తిప్పే నాయక్, రెవెన్యూ శాఖ సిబ్బందితో కలిసి మంగళవారం నెలవారీ సాధారణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోదాము భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ప్రమాణాలు, గోదాము నిర్వ హణ, తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం ఈవీఎం గోదాము నిర్వహణ చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈవీఎంల భద్రత, పారదర్శకత కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్ణీత వ్యవధిలో గోదాము తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలో సూపరింటెండెంట్ విశ్వనాథ శాస్త్రి రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.