BREAKING
మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్. సమస్యాత్మక గ్రామం నూతిమడుగులో ఎస్సై గోపి యాదవ్ పల్లెనిద్ర. కార్తీక పౌర్ణమి వేడుకలకు శివాలయంలో పోటెత్తిన భక్తులు- ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన -అర్చకులు శ్రీనివాస్ శర్మ పొన్నీటిపాళ్యం జనసేన సర్పంచ్ అభ్యర్థినిగా పి.నాగమణి నామినేషన్ : హాజరైన ఎంపీపీ గురునాథ్ యాదవ్,దారం అనిత చిర్యాల్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో కార్తీక మాస సత్యనారాయణ వ్రతాలు ప్రారంభం కోటకాడపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా చౌడప్ప యాదవ్ నామినేషన్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు కార్తీక పౌర్ణమి నాడు చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో భవాని శంకర్ స్వామి మీ ఆదరణతో అఖండ విజయం అందించండి తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన కొత్తూరు పంచాయతీ, పాపం పల్లి గ్రామంలో వైయస్సార్సీపి ప్రచార ఊరు ప్రచార హోరు... విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిపిఓ మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ముసి నదిలో పుణ్య స్నానాలు

వైభవంగా విజయవాడ ఉత్సవ్–2..

Select Suryaa Now
వైభవంగా విజయవాడ ఉత్సవ్–2..

సింగ్‌నగర్ స్టేడియంలో పనులకు శంకుస్థాపన

ఆధ్యాత్మికత, సంస్కృతి, కళల సమ్మేళనంగా ఉత్సవాలు.. 

దేశవ్యాప్తంగా ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు

విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్ : విజయవాడలో దసరా శోభను మరింత వైభవంగా చాటిచెప్పేలా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్–సీజన్ 2 ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఉత్సవాలకు సంబంధించిన పనులకు బోండా సిద్ధార్థ, గొట్టిముక్కల రఘు, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని, నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణ ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ.. గత ఏడాది ప్రజల విశేష ఆదరణ పొందిన విజయవాడ ఉత్సవ్‌ను ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రపతి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉత్సవాలకు హాజరుకానున్నారని చెప్పారు. దుర్గమ్మ, కృష్ణమ్మ చెంత ఆధ్యాత్మికత, ఆహ్లాదం, కళా సంస్కృతుల సమ్మేళనంతో ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించనున్నామని తెలిపారు. పున్నమిఘాట్, మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్‌లో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. గొట్టిముక్కల రఘు మాట్లాడుతూ.. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్–2కు అంకురార్పణ జరిగిందన్నారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమిఘాట్, సిద్ధార్థ ఫార్మా కాలేజీ, పవిత్ర సంగమం ప్రాంతాల్లో విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, బోండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక కళాకారులకు పెద్దపీట వేస్తూనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సాంస్కృతిక బృందాలను విజయవాడకు తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాలు కళాకారులకు ఉపాధి, ప్రోత్సాహం కల్పించే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. లేజర్ షోలు, డ్రోన్ షోలు, క్రాకర్ షోలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఈసారి ఉత్సవాలకు మరింత ఆకర్షణ తీసుకురానున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని మాట్లాడుతూ.. పున్నమిఘాట్‌తో పాటు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 40–45 రకాల జానపద, సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు, ప్రముఖ గాయకులు, భజన్ జామింగ్ బృందాలు, లైవ్ బ్యాండ్స్, మ్యూజికల్ కాన్సెర్ట్స్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. విద్యార్థులు, యువత, మహిళలు, కుటుంబాలను భాగస్వాములను చేసేలా ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న జరిగే ముగింపు వేడుకలు విజయవాడ ఉత్సవ్‌కు ఘనమైన ముగింపుగా నిలవనున్నాయి. మూడు గజరాజులు, అమ్మవారి తొమ్మిది అవతారాల ప్రతిరూపాలు, సుమారు నాలుగు వేల మంది కళాకారులతో ఏలూరు రోడ్డులో భారీ కార్నివాల్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్నివాల్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారని తెలిపారు. విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్–2లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.