BREAKING
పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి? తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి గరివిడి లక్ష్మి ట్రైలర్ విడుదల, జానపద బయోపిక్‌లో అదరగొట్టిన ఆనంది, ఆకట్టుకుంటున్న విజువల్స్ నర్సరీ మట్టి లారీలకు టోల్ మినహాయింపు ఇవ్వాలి.. ఎంపీ పురందేశ్వరికి నర్సరీ రైతుల వినతి

మహాలక్ష్మి పథకానికి ఆడపడచుల నీరాజనాలు

Select Suryaa Now
మహాలక్ష్మి పథకానికి ఆడపడచుల నీరాజనాలు


గత 3 నెలల్లో అదనంగా 97.20 లక్షల మంది ప్రయాణం
డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు, ట్రిప్పుల సంఖ్య పెంపు
టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి

తెలంగాణ బ్యూరో ప్రతినిధిః తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "మహాలక్ష్మి" ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలోని మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు బాటలు వేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ పథకానికి రోజురోజుకూ ప్రయాణికుల నుండి ఆదరణ పెరుగుతుండటంతో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రవాణా సదుపాయాలను నిరంతరం విస్తరిస్తోందని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. గత సంవత్సరం (2025)తో పోలిస్తే ఈ సంవత్సరం (2026) జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025 త్రైమాసికంలో 3,467.91 లక్షల (34.67 కోట్లు) మంది ప్రయాణించగా, 2026 నాటికి అది ఏకంగా 3,565.11 లక్షలకు (35.65 కోట్లు) చేరింది. కేవలం ఈ మూడు నెలల కాలంలోనే గత ఏడాదితో పోలిస్తే అదనంగా 97.20 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను నిరంతరం పరిశీలిస్తూ, బస్సుల సంఖ్యను మరియు ట్రిప్పులను పెంచడం ద్వారా మహిళలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని టీజీఎస్ ఆర్టీసీ అందిస్తోంది. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి మహిళా ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది... ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో డిపో మేనేజర్లు, అధికారులు సమీక్షిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు ట్రిప్పులను, బస్సులను సమకూరుస్తున్నాం. రాబోయే పండుగల సీజన్లలో కూడా మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరిన్ని ప్రత్యేక సర్వీసులు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఎండి నాగిరెడ్డి పేర్కొన్నారు.