BREAKING
*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి?

Select Suryaa Now
కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి?

 

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పవిత్రవాణి పేరు పరిశీలన

సిరిసిల్ల సభలో పద్మశాలి వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ అడుగులు

తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్ సర్కార్

నవంబర్‌లో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఖరారు చేసే యోచన


తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణ ఉద్యమ పితామహుల్లో ఒకరైన కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె పవిత్రవాణి పేరును ఓ స్థానానికి పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆమె, ప్రస్తుతం వైద్యవృత్తిలో ఉన్నారు. సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఒక ఎమ్మెల్సీ సీటును పద్మశాలి వర్గానికి కేటాయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచారు. అయితే, రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమకారుల కుటుంబాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచీ ఆరోపిస్తున్నారు. సీఎం అయ్యాక ఆ దిశగా చర్యలు చేపట్టారు. ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యులుగా నియమించారు. ఈ క్రమంలోనే తాజాగా బాపూజీ కుమార్తెకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. నవంబర్ 14న ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం ముగియనుంది. ఈ మూడు స్థానాల్లో ఒకదాన్ని పద్మశాలి వర్గానికి కేటాయించనున్నారు. పవిత్రవాణిని ఎంపిక చేయడం ద్వారా ఉద్యమ కుటుంబానికి గౌరవం కల్పించడంతో పాటు, బీసీలు, మహిళల్లో పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే సీటు కోసం పార్టీలోని ఇతర పద్మశాలి నేతలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత వంటి వారి పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది.