BREAKING
తిరుపతి జిల్లాలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ.. ఎన్నికల పోలింగ్ విధుల నుండి గర్భిణీ, బాలింత ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి! పాలకొండ పురపాలక సంఘంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగనాధ్ తోటపల్లిలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ వరి పంటలకు ఆశించే తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలి తూరు మామిడి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా" కొల్లి " అనధికార మద్యం విక్రయిస్తే చర్యలు పాముకాటుకు ఒకరు మృతి..... పురపాలక సంఘం వైసిపి అభ్యర్థులకు బి ఫారాలు అందచేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అక్రమ నగదు, మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా – 24 గంటల పాటు పర్యవేక్షణ రేపు మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకుల రాక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయాలి పాలకొండ నగర పంచాయతీ లో ఛైర్మన్, 17 కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ ఎన్నికల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి: " ముప్పై ఏళ్లు గా పురుషులకు దక్కని యంపిపి పీఠం "

జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన డాక్టర్ ఆయిల్ శశాంక్‌కు MRPS నేతల సన్మానం

Select Suryaa Now
జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన డాక్టర్ ఆయిల్ శశాంక్‌కు MRPS  నేతల సన్మానం

 

 తలకొండపల్లి రంగారెడ్డి : గ్రామీణ ప్రాంతంలో జన్మించి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని తమ కుమారుడిని ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రుల కృషి ఫలించింది. మండల పరిధిలోని మాదాయపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ ఆయిల్ శశాంక్ ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ (జనరల్ మెడిసిన్) పూర్తి చేసి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. గ్రామం నుంచి ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన తొలి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. డాక్టర్ ఆయిల్ శశాంక్ తల్లి ఆయిల్ సువర్ణ సత్తయ్యగౌడ్ దంపతులు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరితో కలివిడిగా జీవిస్తూ అనేక కష్టాలు పడుతూ తమ కుమారుడిని ఉన్నత వైద్య విద్య చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని, త్యాగాన్ని గుర్తుచేస్తూ శశాంక్ సాధించిన ఈ విజయం గ్రామస్థుల్లో ఆనందాన్ని నింపింది. పట్టుదల, కృషి ఉంటే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని ఆయన నిరూపించారు. ఈ సందర్భంగా MRPS రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు తుడుం కిరణ్ మాదిగ ఆధ్వర్యంలో డాక్టర్ ఆయిల్ శశాంక్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. వైద్య విద్యలో ఉన్నత అర్హత సాధించి గ్రామానికి పేరు తీసుకువచ్చిన శశాంక్‌ను వారు అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు డాక్టర్ ఆయిల్ శశాంక్ విజయం స్ఫూర్తిదాయకమని, తల్లిదండ్రుల కష్టం, పట్టుదల, విద్యపై ఉన్న నమ్మకం ఒక కుటుంబంలోనే కాకుండా సమాజంలోనూ గర్వకారణమైన విజయాలకు దారితీస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు 

ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ సుధాకర్ ముదిరాజ్, ఉప సర్పంచ్ సిల్కం ఆంజనేయులు ముదిరాజ్, వార్డు సభ్యులు సత్యం గౌడ్, ముదిగొండ పెంటయ్య, భాస్కర్, ముదిగొండ ఎల్లయ్య, సందీప్, ప్రశాంత్, రాజు pj, బాలకృష్ణ, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- చప్పిడి తిరుపతి మేజర్ న్యూస్.