BREAKING
విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి రెండో రోజు 174 నామినేషన్లు డోంట్ స్లీప్' టీజర్‌పై కమల్ హాసన్ ప్రశంసల జల్లు.. ఇంద్ర రామ్ సైకలాజికల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు అందరి సహకారంతో పనిచేస్తా...

కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా: ఎంపీ ఈటల రాజేందర్

Select Suryaa Now
కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా: ఎంపీ ఈటల రాజేందర్


కీసర, మేజర్ న్యూస్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కీసర సర్కిల్ పరిధిలోని చీర్యాల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్‌ కాలనీలో శనివారం పర్యటించిన ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన పిల్లల పార్క్, ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కాలనీ ఏర్పడి 18 ఏళ్లు గడుస్తున్నా శాశ్వత తాగునీటి సౌకర్యం, అంగన్‌వాడీ కేంద్రం, రేషన్ దుకాణం, శ్మశానవాటిక వంటి కనీస వసతులు లేకపోవడం విచారకరమన్నారు. కాలనీలో ఎవరైనా మృతి చెందితే సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని చీర్యాల శ్మశానవాటికకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల తీవ్రతను గుర్తించిన ఈటల రాజేందర్ సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కీసర డివిజన్ అధ్యక్షుడు కోల బలరాజ్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లాల తిరుమల రెడ్డి, మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏలూరు సత్యనారాయణ ముదిరాజ్, నాయకులు డొంకెనీ శాలిని రమేష్ గౌడ్, బర్లపాటి ఆంజనేయులు, కోల మల్లేష్ యాదవ్, కందాడి ప్రభాకర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు సంపత్ గుప్త, దినేశ్ రెడ్డి, వేణు, కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.