ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి:పిఎసిఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి,సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య
కుల్కచర్ల, మేజర్ న్యూస్:ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని పిఎసిఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి, సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య అన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని అంగడి బజార్ లో దీక్ష చేపట్టిన స్వాములకు కుల్కచర్ల కి చెందిన ఈడిగి నర్సింలు గౌడ్, మనసా కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భవాని దీక్ష చేపట్టిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆనందం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తమ్మలి రాంచంద్రయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్, నాయకులు గాదె మహిపాల్, నీరటి కర్ణయ్య, దొమ్మరి ఆంజనేయులు కాటన్పల్లి ప్రవీణ్, చాకలి భీమయ్య, పగిడాల బాలచందర్, రాంరెడ్డి, అంగడి బజార్ హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.