BREAKING
గుండె స్టెంట్ల భద్రతపై ఆందోళన! నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నాని 'ది ప్యారడైజ్'.. డేట్ లాక్! రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. • నడిపెల్లి విజిత్‌ కుమార్‌ హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. 'డెస్టినీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి

రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. • నడిపెల్లి విజిత్‌ కుమార్‌

Select Suryaa Now
రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.  • నడిపెల్లి విజిత్‌ కుమార్‌

సూర్య, లక్షెట్టిపేట/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి : రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో రైతులతో కలిసి లక్షెట్టిపేట పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోయి నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందించామని పేర్కొన్నారు. విద్యుత్‌ కోతలకు కారణాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, దెబ్బతిన్న మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు పంటలు వేయవద్దని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కోరడం సరికాదని విమర్శించారు. రైతులకు విద్యుత్‌, సాగునీరు అందించకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.