BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్

Select Suryaa Now
ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలి – జిల్లా ఉద్యాన అధికారి సత్తార్


కొడంగల్, మేజర్ న్యూస్: కొడంగల్ నియోజకవర్గంలో రైతులకు ఉద్యాన పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గ్రామాల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం బొంరాస్‌పేట మండలం మెట్లకుంట గ్రామంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం.ఏ. సత్తార్, కొడంగల్ డివిజన్ సహాయ ఉద్యాన సంచాలకులు చంద్రశేఖర్, ఆయిల్ పామ్ సాంకేతిక సలహాదారు డాక్టర్ వై.ఎస్. రంగనాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్తార్ మాట్లాడుతూ… ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాల తగ్గుదల నేపథ్యంలో రైతులు నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సంప్రదాయ పంటల సాగులో నష్టాలను తగ్గించుకుని, దీర్ఘకాలిక ఆదాయం పొందేందుకు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. అనంతరం డాక్టర్ రంగనాయకులు ఆయిల్ పామ్ సాగు విధానం, అనువైన నేలలు, మొక్కల మధ్య దూరం, ఎరువులు, నీటి యాజమాన్యం, అంతర పంటలు, దిగుబడులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు వివరించారు. శాస్త్రీయ పద్ధతుల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తే 25 నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు. ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు, రాయితీల వివరాలను అధికారులు తెలియజేశారు. ఆయిల్ పామ్ మొక్కలపై 90 శాతం సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్‌పై 70 నుంచి 90 శాతం రాయితీ, నాలుగేళ్ల వరకు ఎకరానికి రూ.4,200 నిర్వహణ ఖర్చుల సహాయం అందిస్తున్నట్లు వివరించారు. వెదురు సాగుకు ఉచిత మొక్కల పంపిణీతో పాటు ఒక్కో మొక్కకు రూ.50 నిర్వహణ సహాయం, స్ప్రింక్లర్లపై 65 శాతం సబ్సిడీ, కూరగాయల పందిళ్లకు ఎకరానికి రూ.లక్ష వరకు రాయితీ, కూరగాయల సాగుకు ఉచిత నారు పంపిణీ వంటి పథకాల గురించి వివరించారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి సురేంద్రనాథ్, ఉద్యాన శాఖ విస్తరణ అధికారులు, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్లు, మెట్లకుంట సర్పంచ్ ఉమాదేవి నర్సిములు, లోతుకుంట సర్పంచ్ శాంతాబాయి నార్యా నాయక్, బొంరాస్‌పేట సర్పంచ్ వీరేశలింగం, గ్రామ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.