నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు
సదాశివపేట ; సదాశివపేట పట్టణంలో శ్రీ మాత్రే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఐక్యతను చాటుతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉత్సవాలను నిర్వహిస్తున్న శ్రీ మాత్రే అసోసియేషన్ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పెద్దలు జీర్లపల్లి వెంకన్న, సరపు శ్రీనివాస్, అనుముల సాయిరాజ్, బాబు పాటిల్, చీల మల్లన్న, పెద్దగొల్ల అంజన్న, చిక్కుల మల్లేశంతో పాటు యువకులు దిద్దిగే నగేష్, సంక్షయ్ గౌడ్, పెద్ద గౌడ్, పిచ్చెరగెడి శివ, నిఖిల్, జగ్గు తదితరులు పాల్గొన్నారు.