telanagana
అష్టమి మహా హారతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, మేజర్ న్యూస్: అష్టమి సందర్భంగా కాళికాదేవి ఆలయంలో నిర్వహించిన మహా హారతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. మహా హారతి కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు మహా హారతిలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.