BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు

ఝ‌రాసంగం  ః తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు గుంతమార్పల్లి గ్రామంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు, ఆడపడుచులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రజలకున్న అభిమానాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి.ప్రకృతితో మమేకమై, పూలను పూజిస్తూ జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, గ్రామీణ జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.