BREAKING
ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా? అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. విజయవాడలో ఘనంగా ‘అమ్మ కనకదుర్గ’ ఆవిష్కరణ! పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్ నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు మల్లేశ్వరం దసరా ఉత్సవాలలో ప్లాస్టిక్‌కు స్వస్తి.. స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో అన్నసమారాధన!

శ్రీ ఈశ్వర మార్కండేయ దేవస్థానంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
శ్రీ ఈశ్వర మార్కండేయ దేవస్థానంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

సదాశివపేట ; పట్టణంలోని శ్రీ ఈశ్వర మార్కండేయ దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ చైర్మన్ గుజ్జరి వెంకన్న బాబు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీశ్రీశ్రీ డాక్టర్ బిరుదాంకితులు శ్రీనివాస మూర్తి నేతృత్వంలో వేదమంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారుతోంది.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం శ్రీ దుర్గాదేవి మహాయజ్ఞాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులందరితో కలిసి దుర్గాదేవి పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ నామస్మరణ చేశారు. భక్తుల సామూహిక నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు. దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుజ్జరి వెంకన్న బాబు, డైరెక్టర్లు మాలె అనిత, పద్మ మాణిక్యం, కమిటీ సభ్యులు కొంగరి ప్రభు, సంకూరి శివ, నెల్లి కృష్ణ, చిల్వేరి వెంకటేశం, పండాల శివ, మహేష్, గణేష్, సోమశంకర్ తదితరులు పాల్గొన్నారు.