BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Select Suryaa Now
పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక  – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు సిటీ మేజర్ న్యూస్   :స్థానిక ఎన్నికల నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత ప్రజాదరణ పెరుగుతోంది. నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు చేపడుతున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి భారీగా నేతలు టీడీపీ బాట పడుతున్నారు.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌ అధ్యక్షులు బెజవాడ జగదీష్‌, తెలుగుదేశం యువత రూరల్‌ అధ్యక్షులు కొప్పు మౌళి ఆధ్వర్యంలో పంచేడు గ్రామానికి చెందిన దాదాపు 50 మందికి పైగా వైసీపీ కీలక నేతలు ఆదివారం సాయంత్రం నెల్లూరులోని వీపీఆర్‌ కార్యాలయంలో కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలోకి వచ్చిన నాయకులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.అనంతరం చేరిన నాయకులు మాట్లాడుతూ.. వీపీఆర్ దంపతుల సమర్థవంతమైన నాయకత్వం, నియోజకవర్గంలో వారు అందిస్తున్న సేవల పట్ల నమ్మకంతోనే పార్టీలో చేరామని వెల్లడించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో వీపీఆర్ దంపతుల మార్గదర్శకత్వంలో శ్రమించి, కూటమి అభ్యర్థుల ఘనవిజయానికి తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు